
ప్రజలకు ఇబ్బంది లేకుండా పంపిణీ
కుల్కచర్ల: ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ సరుకుల పంపిణీ సమయాన్ని పెంచడం జరుగుతుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రేషన్ బియ్యం పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రేషన్‌బియ్యం ప్రతీ ఒక్క లబ్ధిదారుడికి మూడు నెలల బియ్యం చేరాలనే సంకల్పంతో జూలై 29 వరకు రేషన్ బియ్యం తీసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, మాజీ ఎంపీపీ అంజిలయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నాయకులు రాంచంద్రయ్య, వెంకటేశ్, ఎల్లయ్య, భాను తదితరులు పాల్గొన్నారు.