ధ్రువపత్రాల పరిశీలనకు 183 మంది విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ధ్రువపత్రాల పరిశీలనకు 183 మంది విద్యార్థులు

Jul 2 2025 7:01 AM | Updated on Jul 2 2025 7:18 AM

ధ్రువ

ధ్రువపత్రాల పరిశీలనకు 183 మంది విద్యార్థులు

అనంతగిరి: వికారాబాద్‌ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మంగళవారం కళాశాల ప్రవేశాల కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించామని కళాశాల ప్రిన్సిపాల్‌ రవీందర్‌ తెలిపారు. మొదటి రోజు 194 మంది విద్యార్థులు స్లాట్‌ బుక్‌ చేసుకోగా 183 మంది హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కశాశాల సిబ్బంది నారాయణ, రామలక్ష్మి, సుదీంద్రకుమార్‌, కిరణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసులో ఏడుగురు నిందితులకు రిమాండ్‌

దౌల్తాబాద్‌: భూతగాదాల్లో పాత కక్షలను మనసులో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో పోలీసులు మంగళవారం ఏడుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. జూన్‌ 30న పొలం బాట విషయంలో బండివాడకు చెందిన వెంకట్‌ నాయక్‌, హన్మానాయక్‌ తండాకు చెందిన జైపాల్‌ నాయక్‌, రాములు నాయక్‌, మాన్యానాయక్‌, విజయ్‌ నాయక్‌, వెంకట్‌ నాయక్‌, రవి నాయక్‌, అమ్రీబాయిల మధ్య గొడవ తలెత్తింది. ఈ ఘటనలో ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వెంకట్‌నాయక్‌ అదేరోజు రాత్రి తనబైక్‌పై ఇంటికి వెళ్తుండగా హన్మానాయక్‌ తండావాసులు దాడి చేశారు. తలకు బలమైన గాయాలవడంతో మృత్యువాతపడ్డాడు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితులను అరెస్టు చేసి కొడంగల్‌లో కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ రవిగౌడ్‌ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

దౌల్తాబాద్‌: నిద్రకు ఉపక్రమించిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోనలి గోకఫసల్‌వాద్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన దామోదర్‌రెడ్డి(43), మాజీ కోఆప్షన్‌ సభ్యుడు జాకీర్‌అలీ కలిసిమెలిసి ఉండేవారు. దామోదర్‌రెడ్డి అప్పుడప్పుడు జాకీర్‌ ఇంట్లోనే నిద్రించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇద్దరు జాకీర్‌అలీ ఇంట్లోనే భోజనం చేసి జాకీర్‌ అలీ పైన గదిలో పడుకోవడానికి వెళ్లగా దామోదర్‌రెడ్డి కింద గదిలో నిద్రించడానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం జాకీర్‌అలీ లేచి చూసేవరకు విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే జాకీర్‌అలీ కుటుంబసభ్యులకు తెలిపాడు. వారు వచ్చి చూసి మృతిచెందినట్లు గుర్తించారు. ఈ విషయమై మృతుడి భార్య ప్రభావతమ్మ తన భర్త మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రవిగౌడ్‌ ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ టోర్నీ విజేతగా రంగారెడ్డి జిల్లా

ట్రోఫీ అందజేసిన సీపీ సాయి చైతన్య

నిజామాబాద్‌ నాగారం: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో నాలుగు రోజులుగా సాగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ పోటీలు మంగళవారంతో ముగిసాయి. పోటీ ల్లో విజేతగా రంగారెడ్డి జిల్లా జట్టు నిలువగా, రన్నర్‌గా నిజామాబాద్‌ జట్టు నిలిచింది. ముగింపు కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ధ్రువపత్రాల పరిశీలనకు 183 మంది విద్యార్థులు 1
1/3

ధ్రువపత్రాల పరిశీలనకు 183 మంది విద్యార్థులు

ధ్రువపత్రాల పరిశీలనకు 183 మంది విద్యార్థులు 2
2/3

ధ్రువపత్రాల పరిశీలనకు 183 మంది విద్యార్థులు

ధ్రువపత్రాల పరిశీలనకు 183 మంది విద్యార్థులు 3
3/3

ధ్రువపత్రాల పరిశీలనకు 183 మంది విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement