
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
డీసీసీ ప్రధానకార్యదర్శి
హన్మంత్ ముదిరాజ్
పరిగి: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ గత ప్రభుత్వం పేదలను మోసం చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని నస్కల్‌లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేసి ఇంటి నిర్మాణ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, అశోక్, శ్రీనివాస్, చంద్రయ్య, నరేశ్, అశోక్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
సమ్మెలో పాల్గొంటాం
అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
అనంతగిరి: ఈ నెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సమ్మెలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పాల్గొంటుందని తెలుపుతూ వికారాబాద్ సీడీపీఓ వెంకటలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ నాయకులు వనజ, అరుణ, పుష్ప, ఆండాలు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
ఫార్మర్ రిజిస్ట్రీ
తాండూరు రూరల్: ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఫార్మర్ రిజిస్ట్రీ గుర్తింపు నంబర్ ఉండాలని వ్యవసాయశాఖ తాండూరు డివిజన్ ఏడీఏ రుద్రమూర్తి అన్నారు. సోమవారం మండలంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ఏఓ కొమరయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ తీసుకొని సంబంధిత ఏఈవోల వద్ద నమోదు చేయించుకోవాలన్నారు. రైతుల వివరాలను ఒకే చోట డిజిటల్‌గా భద్రపరిచి, పథకాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఫార్మర్ రిజిస్ట్రీ చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు