
రహదారులతోనేప్రాంతాల అభివృద్ధి
జిల్లా గ్రంథాలయ సంస్థ
చైర్మన్ రాజేశ్‌రెడ్డి
బొంరాస్‌పేట: రహదారులతోనే ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బాపల్లి నుంచి దోమ మండలం బడెంపల్లి వరకు డబుల్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఇందుకోసం రూ.2.24 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్, నాయకులు వెంకట్రాములు గౌడ్, జయకృష్ణ, రాంచంద్రారెడ్డి, మల్లేశం, అంజిల్‌రెడ్డి, మల్లికార్జున్, మోత్యానాయక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఫలితాలు, అడ్మిషన్లలో
తాండూరు కళాశాల భేష్
● విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా
● నోడల్ ఆఫీసర్ శంకర్‌నాయక్‌కు సన్మానం
తాండూరు టౌన్: ఇంటర్ ఫలితాల్లో, అడ్మిషన్లలో తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అద్భుతంగా ఉందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా కితాబు ఇచ్చారు. గురువారం నగరంలో ఆమె రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు జూనియర్ కళాశాలలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 550 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం, గత సంవత్సరం ఫలితాల్లో 83శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో జిల్లా నోడల్ అధికారి శంకర్‌నాయక్‌ను ఆమె ఘనంగా సన్మానించారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవడం పట్ల కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మల్లినాథప్ప, అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
అనంతగిరి: నేషనల్ గ్రీన్ కాప్స్ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ – 2025 పోటీలను విజయవంతం చేయాలని డీఈఓ రేణుకాదేవి కోరారు. గురువారం వికారాబాద్‌లో ఇందుకు సంబంధించి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిచారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్, ఏవో రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్‌పై
చర్యలు తీసుకోవాలి
పరిగి: ప్రభుత్వ భూములను అక్రమ రిజిస్ట్రే షన్ చేస్తున్న పరిగి తహసీల్దార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. గురువారం పరిగి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగంపల్లి గ్రామంలో ఎకరా ప్రభుత్వ భూమిని ఇతరులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. అలాగే గోవిందాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 52లో 16 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారన్నారు. తహసీల్దార్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్, రాంచంద్రయ్య పాల్గొన్నారు.

రహదారులతోనేప్రాంతాల అభివృద్ధి

రహదారులతోనేప్రాంతాల అభివృద్ధి

రహదారులతోనేప్రాంతాల అభివృద్ధి