యాలాల: బైక్ అదుపు తప్పి కింద పడటంతో మండల ట్రాన్స్‌కో ఏఈకి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నారాయణపేట జిల్లాకు చెందిన రఘువీర్ యాలాల మండల ట్రాన్స్‌కో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం స్వస్థలానికి వెళ్లి బుధవారం జిల్లా కేంద్రంలో సమావేశానికి హాజరయ్యేందుకు బైక్‌పై వస్తున్నాడు. కోస్గి సమీపంలోని చంద్రవంచ వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆయనను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ట్రాన్స్‌కో సిబ్బంది తెలిపారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కేశంపేట: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాకపోవడం, చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల ప్రకారం... లేమామిడి శివారు తుర్కలపల్లికి చెందిన దిద్దెల ప్రశాంత్ (30) కూలీ పనులు చేస్తూ భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలు నెలకొడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కృష్ణవేణి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈనెల 23న ఆమెను తీసుకువచ్చేందుకు వెళ్లగా తిరస్కరించడంతో మరుసటి రోజు తిరిగి వచ్చేశాడు. మంగళవారం రాత్రి తన ఇంట్లోని రేకుల పైపు నకు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు తలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యు లు నిర్ధారించారు. షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్ప త్రిలో పోస్టుమార్టం ని ర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అతిగా మద్యం తాగించి లైంగిక దాడి
గచ్చిబౌలి: వైన్ షాపు ముందు పరిచయమైన ఓ యువకుడు అతిగా మద్యం తాగించి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం.. ఈవెంట్ల లో డ్యాన్సర్‌గా పని చేసే ఓ యువతి(23) గచ్చిబౌలి జంక్షన్‌లోని వైన్ షాపు వద్ద మద్యం తాగుతోంది. కుక్‌గా పనిచేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రకాష్ మద్యం తాగుతున్న యువతిని పరిచ యం చేసుకొని..దగ్గర్లోనే తన రూమ్ ఉందని న మ్మించి తీసుకెళ్లాడు. ఇద్దరు మద్యం తాగి నిద్రపోయారు. రాత్రి 2 గంటలకు యువతికి మెళకువ రావడంతో.. ఒంటిపై బట్టలు లేకపోవడంతో లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసింది.