
ఈత, తాటి చెట్లను నరకొద్దు
ఆమనగల్లు: అనుమతి లేకుండా ఈత, తాటి చెట్లను నరికితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్‌చౌహాన్ హెచ్చరించారు. పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఈత, తాటి చెట్ల నుంచి వచ్చే కల్లును విక్రయించి గౌడ కులస్తులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వీరు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కలిగి ఉన్నారన్నారు. ఈత, తాటి చెట్లను నరకడం చట్ట ప్రకారం నేరమని చెప్పారు. తెలంగాణ ఎకై ్సజ్ యాక్ట్ 1968 ప్రకారం సొంత భూమిలోని ఈత, తాటి చెట్లను తొలగించాలన్నా ఎకై ్సజ్ శాఖ అనుమతులు పొందాల్సి ఉంటుందని వివరించారు. అవసరమైన వారు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ పర్యవేక్షణలోని త్రిసభ్య కమిటీ పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తుందని తెలిపారు. కలెక్టర్ అనుమతితో వీటిని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ఒక్కో చెట్టుకు ప్రభుత్వానికి రూ.1,968 రుసుం చెల్లించాలన్నారు. ఎకై ్సజ్ శాఖ అనుమతి లేకుండా చెట్లను తొలగిస్తే మొదటి తప్పుగా భావించి 3 నెలల జైలు శిక్ష, రెండో సారి తొలగిస్తే 6 నెలల జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.
ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్‌చౌహాన్