
మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నాయకులు
మొయినాబాద్‌రూరల్: ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర బీఆర్‌ఎస్ కార్యవర్గ సభ్యులు కొంపల్లి అనంతరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజయ్య, అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవియాదవ్, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ శ్రీహరియాదవ్‌లు అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో పదేళ్ల నుంచి రాష్ట్రంలో దాదుసేవక్ సమాజ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం హిమాయత్‌నగర్ చౌరస్తాలో దాదుసేవక్ సమాజ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా అనంతరెడ్డి, రాజయ్య, రవియాదవ్, శ్రీహరియాదవ్‌లు పాల్గొని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. దాదూసేవక్ సమాజ్ వారు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జాతీయ రహదారి హిమాయత్‌నగర్ చౌరస్తాలో ఎంతో మంది ప్రయాణికులు, ప్రజలు తిరుగుతుంటారని అన్నారు. ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉండడంతో ఈ చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారస్తులు, యువజన సంఘాలు సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మొయినాబాద్ మండల పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు మహేష్, మాల యాదయ్య, మాలస్వామి, రమేష్, దాదూ సేవక్ సమాజ్ సంస్థ నాయకులు జట్‌మల్ చండక్, గన్‌శ్యామ్‌దాస్, రాజేష్‌దాదూ, పురుషోత్తమ్ లడ్డా, నందకిషోర్ చండక్ పాల్గొన్నారు.