శబరిమల యాత్రలో విషాదం
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుల మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: శబరిమలైకు వెళ్లి అ య్యప్పస్వామిని దర్శ నం చేసుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో తండ్రీకొడుకులు మృతి చెందిన సంఘటన మండలంలోని కారణి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని కారణి గ్రామానికి చెందిన వేణు(48) తాపీపని కూలీగా పనిచేసుకుంటున్నాడు. అతని కుమారుడు నరేష్ (30) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వేణు, నరేష్‌తోపాటు నరేష్ కుమార్తె చాతుర్య అయ్యప్పస్వామి మాలను ధరించి, దీక్ష చేపట్టారు. సోమవారం ఉదయం వేణు, కొడుకు నరేష్, నరేష్ కుమార్తె చాతుర్య (9)తోపాటు వరదయ్యపాళెం మండలం గోవర్థనపురం గ్రామానికి చెందిన మునితేజతో కలసి కారులో శబరిమలైకి వెళ్లారు. మంగళవారం ఉదయం శబరిమలైలో అయ్యప్పస్వామి దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం అయ్యారు. మార్గం మధ్యలో తమిళనాడు రాష్ట్రంలోని తేనే టౌన్ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొనడంతో పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. దీంతో కారు డ్రైవింగ్ చేస్తున్న నరేష్, పక్కనే ఉన్న వేణుకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందారు. మునితేజకు రెండు కాళ్లు విరిగిపోగా, చాతుర్య ఎగిరి కాలువలోని పొదల్లో పడడంతో స్వల్పగాయాలయ్యాయి. తేనే టౌన్‌లోని ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, గురువారం కారణి గ్రామానికి మృతదేహాలు వస్తాయని తెలిపారు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం


