మండల సమాఖ్యల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
తిరుపతి రూరల్: మండలంలోని మండల సమాఖ్యల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అ వసరమని డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు తెలిపారు. తిరుపతి గ్రామీణ మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం వెలుగు ప్రాజెక్ట్ ఆధర్యంలో జిల్లాస్థాయి విజన్ మాడ్యూల్‌పై మండల సమైక్య, కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని పది మండలాలు ఏపీఎం, సీసీ, అకౌంటెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 3 నుంచి 6 వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణలో మొదటి రోజు హాజరైన పీడీ శోభన్‌బాబు మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి మహిళ తన ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ తయారు చేసుకోవాలని, అప్పుడే మండల సమాఖ్యలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ప్రతి సభ్యురాలు ఒక విజన్ పెట్టుకుంటే ఆ విజన్‌ను అమలు చేయడానికి వెలుగు ప్రాజెక్టు అధికారులు అండగా నిలబడతారని, తద్వారా సుస్థిర జీవనోపాధిని ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరపడవచ్చన్నారు. ఏపీడీ ప్రభావతి, డీపీఎం వెంకటేష్, మాధవి, ట్రైనర్స్ మునెయ్య ,నరసింహులు, ఏపీఎంలు రాధమ్మ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ
తిరుపతి సిటీ: స్థానిక చిన్నబజార్ వీధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఏపీ స్టేట్ ఉమెన్ కమిషన్ అధికారి ఎస్‌కే రుక్య బేగం బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. పాఠశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని బాలికలను కోరారు. కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్ కుమార్, డీవైఈఓ ఇందిరా దేవి, హెచ్‌ఎం విజయ, ఎంఈఓ బాలాజీ, ఎంఈఓ 2 భాస్కర్ నాయక్, ఎన్‌సీసీ అధికారి భారతి, మహిళా పోలీస్ అధికారి గిరిజ, ఉపాధ్యాయులు మల్లీశ్వరి , సుజాత, సుకుమారి పాల్గొన్నారు.
మండల సమాఖ్యల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ


