ఆలస్యం చేయవద్దు
మైట్ కాటుతో ఏడు నుంచి పది రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం వస్తుంది. తలనొప్పి బాధిస్తుంది. చాలామంది సాధారణ జ్వరం, తలనొప్పేనని నిర్లక్ష్యం చేస్తారు. స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయిన తర్వాత వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. ఆలస్యం చేస్తే అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్క్రబ్ టైఫస్ అనేక అంటు వ్యాధులతో మిళితమై గందరగోళానికి దారితీస్తుంది. రోగులలో రోగ నిర్ధారణకు సెరోలాజిక్ పరీక్షను నిర్వహించవచ్చు. ఎస్చార్ లేదా పాలిమరేస్ చైన్ రియాక్షన్ బయాస్పీని కూడా రోగనిర్ధారణకు ఉపయోగించవచ్చు. దీనిపై రోగులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి.
–డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి,
ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు
తక్షణం వైద్యులను సంప్రదించాలి
జ్వరం రెండు, మూడురోజులు కంటే ఎక్కువ ఉంటే కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలి. పరీక్షలు చేసుకుని జ్వరానికి గల కారణాలను నిర్థారణ చేసుకోవాలి. వీటిని లెక్కచేయకుండా రెండు మందు బిళ్లలు మింగితే తగ్గిపోతుందని అనుకోవడం కరెక్టు కాదు. అలసత్వం వహించి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు. జ్వరాల్లో స్క్రబ్ టైఫస్ ఒకటి. ఈ వ్యాధిని ఆశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులతో పాటు ఇతర ప్రధాన అవయవాలపై ప్రభావం చూపి, ఒక్కొసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంపై మచ్చలను గమనించవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో స్క్రబ్ టైఫస్‌ను గుర్తించి చికిత్స తీసుకోవాలి.
–డాక్టర్ వరప్రసాద్,
సీనియర్ వైద్యులు, తిరుపతి
ఆలస్యం చేయవద్దు


