ముద్దాయిల అరెస్ట్
తిరుపతి క్రైమ్: నగరంలోని ఉపాధ్యాయ నగర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో ఈనెల 18వ తేదీన ఓ వ్యక్తిపై దాడి చేసి దోచుకెళ్లిన దుండగులను అరెస్ట్ చేసినట్లు అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు. ఈనెల 18వ తేదీన రేణిగుంటకు చెందిన భూకే మహేష్(21), జైలక్ష్మణ్ కుమార్(22), జాఫర్(19), కడప జిల్లాకు చెందిన పోకిలి ప్రభుదాసు(34) వీరంతా కలిపి ముఠాగా ఏర్పడ్డారు. బాధితున్ని రాపిడో డ్రైవర్ అంటూ నమ్మించి బైక్‌లో నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడికి పాల్పడి దోచుకున్నారన్నారు. అతని వద్ద నుంచి రూ.25 వేల నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరో ముద్దాయి అయిన వివేక్ పరారీలో ఉన్నారని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. వీరందరిపై కూడా రౌడీషీట్లు ఓపెన్ చేసి.. ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. ఈ కేసును చేధించడంలో ఎస్‌ఐ లోకేష్ కృషి చేశారన్నారు.


