
వైద్యాధికారుల విచారణ
సత్యవేడు : పంచాయతీ పరిధిలోని పల్లాపు వీధిలోని క్లినిక్, మెడికల్ స్టోర్‌ను దాసుకుప్పం పీహెచ్‌సీ డాక్టర్ హర్షవర్ధన్, ఎంపీహెచ్‌ఓ సుబ్రమణ్యం కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. గురువారం సాక్షి దినపత్రికలో శ్రీకాలం చెల్లిన ఔషధాల పంపిణీశ్రీ వార్తకు మెడికల్ అధికారులు స్పందించారు. కాలం చెల్లిన మందుల విక్రయంపై విచారణ చేపట్టారు. డేట్ పరిశీలించకుండా పొరబాటున మందులు ఇచ్చానని, ఇకపై పొరబాట్లు చేయమని ఆర్‌ఎంపీ సమాధానం ఇచ్చారు. బాధితురాలు శోభారాణిని విచారించి వివరాలు సేకరించారు. తనిఖీ నివేదిక వివరాలను డీఎంహెచ్‌ఓకు పంపుతామని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 640,15 మంది స్వామి వారిని దర్శించుకోగా 26,786 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్‌లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.
పీహెచ్‌సీలో ప్రసవాలు పెరగాలి
బుచ్చినాయుడుకండ్రిగ : పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెరగాలని రాష్ట్ర వైటల్ స్టాటస్టిక్స్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌రావు తెలిపారు. శుక్రవారం బుచ్చినాయుడుకండ్రిగలోని పీహెచ్‌సీని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మృదులరాణి, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ నాగేంద్ర కుమార్‌తో కలసి ఆయన తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్స్ రికార్డులను, లేబొరేటరీలోని సౌకర్యాలను, పరికరాలను, ఫార్మసీ విభాగంలోని మందులను, పరిశీలించారు. ఏఎన్‌ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామ సచివాలయాల వద్దనున్న క్లినిక్‌లలో వైద్యసేవలను సక్రమంగా అందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది తమ పనితీరును మెరుగు పరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు మురళీధర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

వైద్యాధికారుల విచారణ