
ఆటో బోల్తా
సైదాపురం : ఆటోలో బతుకు దెరువు కోసం 10 మంది గని కార్మికులు కూలీ పనులకు వెళుతూ ప్రమాదశాత్తు పొలంలో బోల్తా పడటంతో అందులో ఉన్న ఇద్దరు గని కార్మికులు గాయాలపాలయ్యారు. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోని పల్లెమిట్టలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల మేరకు ఇలా.. మండల కేంద్రమైన సైదాపురానికి చెందిన శ్రీనివాసులు ఆటో ద్వారా మండలంలోని తురిమెర్ల గ్రామ సమీపంలోని ఓగని పనులకు ప్రతి రోజు సైదాపురం నుంచి కూలీలను తీసుకుని పనులు ముగిసిన వెంటనే మళ్లీ స్వగ్రామానికి వస్తుండేవారు.ఈక్రమంలో శుక్రవారం ఉదయాన్నే 10 మంది గని కార్మికులతో సైదాపురం నుంచి గని పనులు జరిగే తురిమెర్లకు ఆటోలో బయలుదేరారు.సైదాపురం సమీపంలోని పల్లెమిట్ట దగ్గరకు వచ్చే సరికి కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న రాధమ్మ, వెంకటమ్మ గాయాలపాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం 108లో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ పలువురు కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.
క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది