
విలీనం.. ఆగని పోరాటం
కేవీబీపురం : ప్రభుత్వ బడుల విలీనానికి వ్యతిరేకంగా పాతపాళెం,ఏపీపురం, గురుకులకండ్రిగ తదితర గ్రామాల ప్రజలు శుక్రవారం ఆయా పాఠశాలల వద్ద ఆందోళనకు దిగారు. ఇరవై రోజులుగా మూతవేసిన పాఠశాలలను అధికారులు తెరిపించడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. బడులకు తాళాలు వేసి నిరసన తెలిపారు. పాఠశాల అభివృద్ధి కమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విలీన ప్రక్రియ చేపట్టడం దారుణమని మండిపడ్డారు. రీమ్యాపింగ్ ద్వారా సమస్యను పరిష్కరిస్తేనే తమ పిల్లలను బడికి పంపుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు గురుకులకండ్రిగ వాసులు ఈఓపీఆర్‌డీకి వినతిపత్రం అందించారు.

విలీనం.. ఆగని పోరాటం