
పిల్లలకు చదువు తప్ప ఇంకేం ఇవ్వగలం.. ఆస్తిపాస్తులు సమకూర
● పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల ఇక్కట్లు ● ఫీజుల కోసం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న స్కూళ్లు.. కాలేజీ యాజమాన్యాలు ● విద్యాసంస్థల్లో చేర్పించేందుకు తప్పని అప్పులు ● అధిక వడ్డీలతో ఎడతెగని పాట్లు ● పుస్తెలు సైతం తాకట్టు పెడుతున్న మాతృమూర్తులు
తిరుపతి సిటీ : జిల్లాలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పాఠశాలల్లో దాదాపు పూర్తికాగా, ఇంటర్, ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ, పీజీ కళాశాలలో ఇప్పుడిప్పుడే ప్రవేశాలు ఊపందుకుంటన్నా యి. తమ పిల్లలు ఇంజినీర్, డాక్టర్ కావాలనే కోరికలతో తల్లిదండ్రులు జిల్లాలోని పేరొందిన కార్పొరేట్ విద్యాసంస్థల వెంటపడుతున్నారు. దీంతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునేందుకు ఫీజులను ఆమాంతం పెంచి దండుకుంటున్నాయి. విద్యాసంస్థలు చెప్పింనంత ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు వడ్డీ వ్యాపారులు, కుదువ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వడ్డీ వ్యాపారలు రూ.5 నుంచి రూ.10ల వరకు డిమాండ్ చేస్తూ ప్రామిసరీ నోట్లు రాయించుకుని, ఖాళీచెక్కులను తీసుకుని నగదు ఇస్తున్నారు. అలాగే ఫీజుల చెల్లింపులకు పలువురు ఇంటిలోని బంగారం తాకట్టు పెట్టేందుకు కుదువ వ్యాపారులను సంప్రదిస్తున్నారు. దీంతో జిల్లాలోని పాన్ బ్రోకర్ షాపులు సైతం ఈ నెల కళకళలాడుతున్నాయి. వారు కూడా బంగారును తాకట్టు పెట్టుకుని రూ.3లు నుంచి రూ.5 వడ్డీతో నగదు అందిస్తున్నారు. వడ్డీకి సైతం చక్రవడ్డీ వర్తిస్తుందని సంతకాలు తీసుకుంటున్నారు.
చదివించాలనే తపన
పిల్లలు మాలా కష్టాలు పడకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడాలనే తపనతో అప్పులు చేసి ఉన్నతంగా చదివించేందుకు సిద్ధపడ్డాం. నా భర్త, నేను ఇద్దరం సొంతంగా తిరుపతిలో కిరాణా దుకాణం నడుపుతున్నాం. మాకు అబ్బాయి, అమ్మాయి కవల పిల్లలు. ఇద్దరూ ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేశారు. ఒకరి డాక్టర్ చేయాలనే ఆశతో ఇంటర్ ప్రైవేటు కళాశాలలో బైపీసీ చేర్పించాం. ఏడాదికి రూ.2లక్షలు ఫీజు కట్టాం. అమ్మాయిని తిరుపతిలో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ చేర్పించాం. ఫీజు ఏడాదికి రూ. 1.50లక్షలు చెప్పారు. ఇందులో రూ. 2లక్షలకు బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టాం. – ద్రాక్షాయిణి,
కిరాణా దుకాణం నిర్వాహకులు, రేణిగుంట
చదువు కొనాల్సి వస్తోంది
విద్య వ్యాపారంగా మారిపోయింది. జూన్ వచ్చిందంటే మాలాంటి మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి దారుణం. పిల్లల చదువులకు అప్పులకోసం వెతుకులాట తప్పడం లేదు. నేను తిరుపతిలో ఓ విద్యాసంస్థలో తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేస్తున్నా. నా భర్త దివ్యాంగుడు. వచ్చే జీతం ఇంటి ఖర్చులు, బాడుగకు సరిపోతుంది. ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి చిన్న కంపెనీలో పనిచేస్తున్నాడు. మరో కుమారుడు ఇంటర్ పూర్తి చేసి నీట్ కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రైవేటు కళాశాలలో సీటు వచ్చినా కనీసం రూ. 5లక్షలు కావాల్సిన పరిస్థితి. అందుకోసం ఇంట్లో బంగారం తాకట్టు పెట్డడంతో పాటు మరో రూ.2లక్షలు అప్పు చేయాల్సిందే. ఈ కాలంలో చదువును కొనాల్సి వస్తోంది. – శ్రావణ భార్గవి, అధ్యాపకులు, తిరుపతి
తిప్పలు తప్పడం లేదు
నేను తిరుపతిలోని ఓ ప్రముఖ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నా. నా భార్య సైతం ఓ ప్రైవేటు షాపులో పనిచేస్తోంది. ఇద్దరి జీతం నెలకు రూ.26వేలు వస్తాయి. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఓ అమ్మాయి పదో తరగతిని ఈ ఏడాది పూర్తి చేసింది. ప్రైవేటు కళాశాలలో ఎంపీసీలో చేర్పించాం. జేఈఈ మెయిన్స్ కోచింగ్ ఇస్తామని ఏడాదికి రూ.1.50లక్షలు చెప్పారు. ప్రస్తుతం అప్పు చేసి రూ.లక్ష కట్టాం. మరో అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది. ఇటీవల విడుదల చేసి నీట్ ఫలితాలలో 480మార్కులు సాధించింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నాం. ఆ అమ్మాయి చదువుకోసం విలేజ్‌లో ఉన్న పొలాన్ని అమ్మకానికి పెట్టాం.
– శివశంకర్, డెలివరీ బాయ్, తిరుపతి రూరల్

పిల్లలకు చదువు తప్ప ఇంకేం ఇవ్వగలం.. ఆస్తిపాస్తులు సమకూర

పిల్లలకు చదువు తప్ప ఇంకేం ఇవ్వగలం.. ఆస్తిపాస్తులు సమకూర

పిల్లలకు చదువు తప్ప ఇంకేం ఇవ్వగలం.. ఆస్తిపాస్తులు సమకూర