
మోసగించడం చంద్రబాబు నైజం
ఏడాది కాలంగా వంచనే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మేనిఫెస్టో బాండ్లపై సంతకాలు చేసి మరీ ప్రజలకు ఇచ్చారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయక పోగా అనేక ఆంక్షలు విధించి లక్షల మంది లబ్ధిదారులను తొలగించారు. తల్లికి వందనం పేరుతో లక్షల మంది తల్లులకు ఎగనామం పెట్టారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఆడబిడ్డ నిధి లేదు. అబద్దపు హామీలతో ప్రజలను మోసగించడం తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపానపోలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్షపూరిత రాజకీయాలకు చంద్రబాబు, పవన్‌కళ్యాన్, లోకేష్ పాల్పడుతున్నారు. అయినా తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి వెంట వస్తున్న జన సంద్రాన్ని చూసి కూటమి నాయకుల గుండెల్లో దడ పుడుతోంది. అందుకే జగనన్నను ఎక్కడికక్కడ నిలువరించాలని చూస్తున్నారు. చంద్రబాబు మోసాల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి మోసాలను ఎండగడుదాం. అందుకు ప్రతి నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ నేతలు కంకణబద్ధులు కావాలి.
– భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతో గత ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలకంటే ఎక్కువే ఇస్తానంటూ నోటికి వచ్చిన అబద్దాలు చెప్పి నమ్మిన వాళ్లను మోసగించడం చంద్రబాబు నైజం. ఎన్నికల్లో ఇచ్చిన శ్రీసూపర్‌సిక్స్ హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చావా? బాబూ. అధికారలోకి రాగానే ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానన్నావ్, 50 ఏళ్లకే పెన్షన్ అన్నావ్, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నావ్, మహిళలకు ఉచిత బస్సు అన్నావ్, లక్షల ఉద్యోగాలు అన్నావ్, రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావ్ శ్రీఇలా చెప్పుకుంటూ పోతే వందల అబద్దపు హామీలు గుప్పి ప్రజలను మోసగించావు. వీటితో పాటు తల్లికి వందనం పేరుతో కొంతమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసి లక్షల మంది తల్లులను వంచించావు. ఇలా చెప్పిన అబద్దాన్నే పది సార్లు చెప్పి ప్రజలను మోసగించడం తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి తెలియదన్నారు. ఇప్పటికే చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలంతా గ్రహిస్తున్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి నాయకులను నిలదీసేలా చేద్దాం.
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్
జగనన్న పాలనలోనే సంక్షేమం
కూటమి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తాం

మోసగించడం చంద్రబాబు నైజం

మోసగించడం చంద్రబాబు నైజం

మోసగించడం చంద్రబాబు నైజం