
పదవులతో పార్టీని బలోపేతం చేయండి
నగరి: పార్టీ ఇచ్చిన పదవులను బాధ్యతగా భావించి, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శిగా నియమితులైన చిరంజీవి పార్టీ నేతలతో మాజీమంత్రి నివాసానికి విచ్చేసి ఆమెను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా వారితో మాట్లాడుతూ పార్టీ గుర్తించి ఇచ్చిన పదవులను ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజలకు అండగా నిలబడి వారి తరఫున పోరాడాలన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎండ కడుతూ పేదవారికి న్యాయం జరిగేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.