
బైక్‌ను ఢీకొట్టిన కారు
● యువకుడి దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు
నారాయనవనం : మండలంలోని జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో కేవీబీపురం మండలానికి చెందిన గుణశేఖర్(21) మృతి చెందగా శశికుమార్(19) తీవ్ర గాయాలతో తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేవీబీపురం పాతపాళ్యంకు చెందిన గుణశేఖర్, శశికుమార్ బైక్‌పై పుత్తూరు వెళ్లడానికి పాలమంగళం మీదుగా మండలంలోని 716–ఎ జాతీయ రహదారిపై ఐఆర్ కండ్రిగ క్రాస్‌ను దాటారు. అదే సమయంలో తిరుపతి నుంచి చైన్నెకి వెలుతున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. కారు వేగానికి బైక్ 10 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బైక్ నడుపుతున్న గుణశేఖర్‌కు కాళ్లు, చేయి విరిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బైక్ వెనుక కూర్చున్న శశికుమార్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. బాధితులను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న గుణశేఖర్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలైన శశికుమార్‌కు మెరుగైన వైద్య కోసం తిరుపతికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తి బైక్‌పై పరారీ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.

బైక్‌ను ఢీకొట్టిన కారు