తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు | Due To Heavy Rain Forecast School Holidays In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు

Aug 13 2025 7:03 AM | Updated on Aug 13 2025 7:45 AM

Due To Heavy Rain Forecast School Holidays In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా, భారీ వర్ష సూచన దృష్ట్యా తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాఠశాలల్లోనూ బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.  

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం
ఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై, ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement