క్లుప్తంగా

50 కిలోల నిషేధిత

ప్లాస్టిక్‌ వస్తువులు సీజ్‌

అన్నానగర్‌: వాల్పారైలో బుధవారం 50 కిలోల నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. కోయంబత్తూరు జిల్లా వాల్పారై ప్రాంతంలో మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య సూపర్‌ వైజర్ల బృందం బుధవారం కిరాణా దుకాణాలు, బేకరీలు, మల్టీ పర్పస్‌ షాపులు, ఆహార గోడౌన్లలో తనిఖీలు నిర్వహించింది. 50 కిలోల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను సీజ్‌ చేసి దుకాణదారులకు జరిమానా విధించింది.

ప్రభుత్వ ఉద్యోగం పేరిట రూ.24.80 లక్షలు మోసం

అన్నానగర్‌: కృష్ణగిరి జిల్లా కల్లావి సమీపంలోని కల్దాయిపట్టికి చెందిన రామచంద్రన్‌ (25) ఎంఎస్‌డీ, ఎంఎడ్‌ పట్టభద్రుడు ఇతడిని ధర్మపురి ఒట్టపట్టికి చెందిన పుష్ప లింగం (34). ఇతని భార్య సుభాషిణి (27) ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ.24. 80లక్షలు మోసంచేశారు. దీంతో రామచంద్రన్‌ తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని ఆ దంపతులను కోరాడు. కానీ వారు డబ్బులు తిరిగివ్వకపోగా.. బెదిరింపులకు పాల్పడ్డారు. రామచంద్రన్‌ ఫిర్యాదు మేరకు కల్లావి పోలీసులు పుష్ప లింగాన్ని బుధవారం అరెస్టు చేశారు. ఇతని భార్య సుభాషిని కోసం గాలింపు చేపడుతున్నారు.

పవర్‌ ట్రాన్స్‌ మిషన్‌ల

అభివృద్ధిపై దృష్టి

సాక్షి, చైన్నె: పవర్‌ ట్రాన్స్‌ మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌ వర్క్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తోషిబా ఇండియా (టీటీడీఐ) చైర్మన్‌ హిరషి పురుటా తెలిపారు. తోషిబా ట్రాన్స్‌ మిషన్‌ సేవలను గురించి ఆయన స్థానికంగా బుధవారం వివరించారు. 400 కేవీతో 23 యూనిట్లు, 220 కేవీతో 9 గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ స్విచ్‌ గేర్‌ (జీఐఎస్‌) కోసం నెట్‌వర్క్‌ల అభివృద్ధి, మెరుగే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. గోవాలో 2 ఇన్‌టూ 500ఎంవీఏ సబ్‌ స్టేషన్‌, ఆలమూరు, కోడమూరులలో 400 కేవీ ఓల్టేజ్‌ స్థాయిలో సోలార్‌, విండ్‌ పునరుత్పాదక ప్రాజెక్ట్‌, హైదరాబాద్‌ సమీపంలో ప్రత్యేక సదుపాయాలతో మే నెలలో సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. అధునాతన సాంకేతిక ప్రక్రియలు, భారీ ఉత్పత్తి సామర్థ్యం, అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్‌ ఫోర్స్‌తో మేడ్‌ ఇన్‌ ఇండియా లక్ష్యంతో జీఐఎస్‌ పనితీరు ఉంటుందని స్పష్టం చేశారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top