
తమిళసినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు అభిమానులను శోకసంద్రంలో ముంచేస్తున్నాయి. తాజాగా మిమిక్రీ ఆర్జిస్ట్ కోవై గుణ (54) మృతి వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కలక్కపోవదు మాదు కార్యక్రమంలో తొలి టైటిల్ విన్నర్ కోవై గుణ. ఆ తరువాతు పలు వేదికలపై తన మిమిక్రీతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఆయన సొంత ఊరు కోవై జిల్లా, శరవణంపట్టి సమీపంలోని వినాయకపురం గ్రామం. ఈయనకు భార్య,ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లకు పెళ్లి చేశారు.కాగా ఇటీవల కిడ్నీ సమస్యకు గురైన కోవై గుణ కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యచికిత్స పొందుతూ వచ్చారు. అయితే వైద్యం ఫలించక బుధవారం తుదిశ్వాస విడిశారు.