అమ్మా క్యాంటీన్‌లతో రూ.95 కోట్లు నష్టం – కార్పొరేషన్‌ సర్వే వెల్లడి

అవార్డు అందుకుంటున్న డీవీవీ దానయ్య,  చిత్రంలో నరసింహన్‌, అలీ, కల్యాణ్‌రామ్‌  - Sakshi

కొరుక్కుపేట: నిరుపేద ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో ఏర్పాటైన అమ్మా క్యాంటీన్‌లు ప్రస్తుతం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. చైన్నె కార్పొరేషన్‌ నిర్వహించిన తాజా సర్వేలో రూ.95 కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. వివరాలు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో అమ్మా క్యాంటీన్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. రూపాయికే ఇండ్లీ, మూడు రూపాయలకే చపాతీ అంటూ పెద్దఎత్తున ఆహార పదార్థాలను ఇక్కడ తక్కువ ధరకే విక్రయిస్తున్నారు ఈ పరిస్థితిలో చైన్నెలోని అమ్మా క్యాంటీన్‌లకు ప్రస్తుతం కస్టమర్ల సంఖ్య తగ్గడంతో ఆదాయం కూడా బాగా పడిపోయింది. చైన్నె కార్పొరేషన్‌ తరపున ఆడిట్‌ నిర్వహించారు. కొన్నేళ్లుగా ఆదాయం కంటే నష్టాలే ఎక్కువయ్యాయని తెలిసింది. ఈ క్యాంటీన్లు 2014–15 లో రూ.40 కోట్లు నుంచి రూ.51 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ పరిస్థితుల్లో 2021–22లో రూ.95 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిసింది. కొన్ని చోట్ల దుకాణాదారులు పెద్దమొత్తంలో సరుకుల కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఇక ఏళ్ల తరబడి నష్టాలు పెరుగుతుండడంతో వీటి కొనసాగింపుపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఘనంగా కళాసుధ

విశిష్ట ఉగాది పురస్కారం

తమిళసినిమా: శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్‌ విశిష్ట ఉగాది పురస్కారాల ప్రదానం బుధవారం చైన్నెలో జరిగింది. మ్యూజిక్‌ అకాడమీలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య, విశిష్ట అతిథులుగా మాజీ గవర్నర్‌ నరసింహన్‌, గాయని పి.సుశీల, నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుడు డాక్టర్‌ అలీ హాజరయ్యారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్‌ స్వాగతోపన్యాసం చేశారు. ఇందులో ఉత్తమ నిర్మాత అవార్డును ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి గాను.. డీవీవీ దానయ్య అందుకున్నారు. ఉత్తమ నటుడు అవార్డును బింబిసార చిత్రానికి గాను నందమూరి కల్యాణ్‌రామ్‌కు ప్రదానం చేశారు. లతా మంగేష్కర్‌ పురస్కారం గాయని ఎంఎం శ్రీలేఖకు అందజేశారు. నటి ఈశ్వరరావుకు బాపు బొమ్మ పురస్కారం, దర్శకుడు హను రాఘవపూడి బాపు–రమణ పురస్కారం ప్రదానం చేశారు. అలాగే మహిళ రత్న అవార్డును, లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును, ఉత్తమ నటి, చిత్రం, రచయిత తదితర అవార్డులను ఈ వేడుకలో ప్రదానం చేశారు.

న్యూస్‌రీల్‌

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top