
విద్యార్థినితో డీఎస్పీ మాయవన్, పోలీసులు
అన్నానగర్: తూత్తుకుడి జిల్లా ఆళ్వార్తిరు నగర్‌కు చెందిన లోకనాథన్ కుమార్తె తామరైకని నజరత్‌లోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదివింది. ఆమె తల్లి చనిపోవడంతో మూడు నెలలుగా పాఠశాలకు వెళ్లలేదు. ఈ స్థితిలో శ్రీ వైకుంఠం డిప్యూటీ ఎస్పీ పరిధిలోని ప్రాంతాలలో మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థులపై పోలీసులు సర్వే చేశారు. తామరైకని పాఠశాలకు వెళ్లడం మానేసినట్లు డీఎస్పీ మాయవన్ గుర్తించారు. ఆమెను పిలిచి మళ్ళీ పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థికి అవసరమైన పాఠ్య పుస్తకాలు, బ్యాగులు కొనుగోలు చేశాడు. బుధవారం నుంచి తిరిగి నజరత్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.