
పుష్కరిణి వద్ద మొంక్కలు నాటుతున్న కమిషనర్ రాజ్యలక్ష్మి
తిరువళ్లూరు: పట్టణంలోని నీటి ఆధారిత ప్రాంతాలను గుర్తించి వాటిని పరిరక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తిరువళ్లూరు మున్సిపల్ కమిషనర్ రాజ్యలక్ష్మి వివరించారు. తిరువళ్లూరు జిల్లా జేఎన్ రోడ్డులో అపరిశుభ్రంగా వున్న పుష్కరిణిని రూ.4 లక్షలతో మరమ్మతులు చేశారు. అందులో పూడికను సైతం తీయించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పుష్కరిణికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పుష్కరిణిని పరిశుభ్రంగా వుంచడంతో పాటు ప్లాస్టిక్ వాడాకాన్ని నిషేధిస్తామని స్తానికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ రహిత తిరువళ్లూరుగా తీర్చిదిద్దడానికి మున్సిపాలిటీ చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ అధికారి గోవిందరాజ్ తదితరులు పాల్గొన్నారు.