
తిరుత్తణి: ఇళ్లకు సమీపంలో విద్యుత్ స్తంభం దెబ్బతిని కూలేందుకు సిద్ధంగా ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆర్కేపేట యూనియన్ ఆదివరాహపురం గ్రామంలో ఇళ్లకు సమీపంలో రోడ్డులో పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం అడుగు భాగం దెబ్బతినింది. రోడ్డు సమీపంలోని కుటుంబీకులు రోడ్డులో నడిచి వెళ్లేందుకు చిన్నారులు, మహిళలు ఆందోళన చెందుతున్నారు. గాలివానకు స్తంభం కూలిపడే ప్రమాదముందని, వెంటనే తొలగించాలని విద్యుత్‌శాఖ అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తిరుత్తణి డివిజన్ విద్యుత్‌శాఖ ఇంజినీరు స్పందించి కొత్తగా విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని గ్రామీణులు కోరారు.
దుస్థితిలో విద్యుత్ స్తంభం, అడుగుభాగంలో పెచ్చులూడిన విద్యుత్ స్తంభం
