
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీఓ హస్త్రత్‌భేగం
తిరుత్తణి: నేతకార్మికులు, మాస్టర్‌వీవర్స్ మధ్య ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. తిరుత్తణి, ఆర్కేపేట, పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లో 50 వేలకు పైగా మరమగ్గ కార్మికులు నివశిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యావసరవస్తువుల ధరలు పెరిగిన క్రమంలో కూలి పెంచాలనే డిమాండ్‌తో గత ఏడాది నిరవధికం సమ్మె చేపట్టారు. దీంతో ఆర్డీఓ స్థాయి కమిటీ నియమించి ఇరు వర్గాలతో చర్చలు జరిపి కూలీ పెంచి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫిర్యాదుతో ఆర్డీఓ హస్త్రత్‌బేగం ఆధ్వర్యంలో ఇరు వర్గాలతో చర్చలు నిర్వహించారు. అధికారులు బృందం ఇరువర్గాలతో చర్చలు చేపట్టి గత ఏడాది కుదిరిన ఒప్పందం ప్రకారం కూలి ఇవ్వాలని తగ్గించరాదని అధికారులు తేల్చి చెప్పడంతో అందుకు మాస్టర్‌వీవర్స్ అంగీకరించారు.