రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడేళ్ల పదవి కాలానికి గాను నూతన అధ్యక్షుడిగా బి.రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా దండా శ్యాంసుందర్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. సంఘం కోశాధికారిగా ఎస్‌ఏ హమీద్‌ఖాన్, సహ అధ్యక్షుడిగా కె.రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కె.విద్యాసాగర్‌రావు, బి. కృష్ణయ్య, ఆర్. నిర్మల, కార్యదర్శులుగా ఎస్. నర్సయ్య, ఎం.దేవదానం, జాయింట్ సెక్రటరీలుగా ఎం. పద్మారెడ్డి, బి.సుందరయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎన్. వెంకటేశ్వర్ రావు, జి.నర్సయ్య, టి.శోభా రాణి, ప్రచార కార్యదర్శిగా గాలి శ్రీనివాస్, స్టేట్ కౌన్సిలర్లుగా పి. జగన్మోహనరావు, టి.యాదగిరిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సీతా రామయ్య రాగా, ఎన్నికల అధికారిగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎం. సుబ్బయ్య, పరిశీలకులుగా రాష్ట్ర కార్యదర్శి పి.శరత్ బాబు, ఖమ్మం కార్యదర్శి టి. వేణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


