ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
చిలుకూరు: ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం చిలుకూరు మండలంలోని బేతవోలులో నామినేషన్ క్లస్టర్‌ను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. కలెక్టర్ వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ ధృవకుమార్, ఎంపీడీఓ నరసింహారావు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
పొరపాట్లకు తావివ్వొద్దు
అనంతగిరి: నామినేషన్ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం అనంతగిరిలో నామినేషన్ క్లస్టర్ కేంద్రంతో పాటు ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. నామినేషన్‌లను స్వీకరించిన తరువాత డేటాలో ఎటువంటి తప్పులు లేకుండా టీపోల్ యాప్‌లో పొందుపర్చాలన్నారు. ఆయన వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ కె. హిమబిందు, ఎంపీడీఓ హరిసింగ్, ఎంపీఓ సుష్మా, సినియర్ అసిస్టెంట్ ప్రసాద్, ఆర్‌ఐ వెంకట నగేష్ ఉన్నారు.
టీపోల్ యాప్‌లో వివరాలు నమోదు చేయాలి
మునగాల: రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా స్వీకరించిన నామినేషన్ల వివరాలను టీపోల్ యాప్‌లో సంక్షిప్తంగా నమోదు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి మునగాల మండలంలోని ఆకుపాముల క్లస్టర్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ డి.శీరిష, ఎంపీఓ నరేష్, రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్


