
కల సాకారమయ్యేనా..?
ఉమ్మడి జిల్లాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కలగానే మిగిలిపోతోంది.
- 8లో
మూడు చోట్ల మాత్రమే పనులు ప్రారంభం
కోదాడ: అమృత్ 2.0 పథకం కింద కోదాడ మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం రూ.20 కోట్ల 80 లక్షలను మంజూరు చేసింది. మున్సిపాలిటీలో తాగునీటి సమస్యను తీర్చడానికి ఈ నిధులతో ప్రస్తుతం మూడు చోట్ల వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణానికి ప్రజారోగ్యశాఖ అధికారులు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. పట్టణంలో 3 కేఎల్, 5 కేఎల్, 7 కేఎల్ కెపాసిటీ గల ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులన్నీ పునాది దశలోనే ఉన్నాయి. మున్సిపాలిటీకి సంబంధం లేకుండా ప్రజారోగ్యశాఖ అధికారులు పనులు చేస్తుండడంతో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ట్యాంకుల నిర్మాణం పూర్తయిన తరువాత దానికి అనుబంధంగా పైప్‌లైన్ పనులను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో పనులను వేగవంతం చేస్తామని ప్రజారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.