
కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి
నడిగూడెం : కళాశాలలో ప్రథమ సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భానునాయక్ అన్నారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కళాశాలలో ఉన్న మౌలిక వసతులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించి, కళాశాలలో చేర్పించేలా కృషి చేయాలన్నారు. నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇప్పటి వరకు 165 మంది విద్యార్థులు చేరినట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ డి.విజయ నాయక్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
భానునాయక్