కొన్ని ఘటనలు..
● సిక్కోలును వణికిస్తున్న
మహిళల హత్యోదంతాలు
● రెండు రోజుల వ్యవధిలో
ఇద్దరు మృతి
● మహిళలే లక్ష్యంగా దాడులు
శ్రీకాకుళం క్రైమ్:
జిల్లాలో వరుస హత్యోదంతాలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలు మృతి చెందడం శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. నిరంతరం పెట్రోలింగ్, పల్లెల్లో అసాంఘిక శక్తులపై నిఘా, మహిళల భద్రతే లక్ష్యంగా శక్తి యాప్.. ఇలా పోలీసు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. పశువుల్ని మేపేందుకు వెళ్లిన వృద్ధురాలు హత్య, ఆస్పత్రికని బయల్దేరిన మహిళ జాతీయ రహదారి పక్కనే శవంగా తేలడం వంటి ఘటనలు 48 గంటల్లో చోటు చేసుకోవడం నిఘా వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.
బయటకు వెళ్లాలంటే భయమే..
ప్రశాంత సిక్కోలులో మహిళలపై జరుగుతున్న దాడులు, దారుణాలు కలవరపెడుతున్నాయి. ఓ వైపు జిల్లావ్యాప్తంగా వరికోతలు, నూర్పులు ముమ్మరంగా జరుగుతుండటంతో రైతులంతా పంట పొలాలు, కల్లాల్లో పనులతో బిజీగా గడుపుతున్నారు. ఇటువంటి సమయాల్లో ఇంట్లో నుంచి ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ దుకాణాలు, ఊరూరా బెల్టు షాపులు వెలిశాయి. విచ్చలవిడిగా మద్యం దొరకడం, పూటుగా తాగిన మైకంలో దారుణాలకు తెగబడుతుండటం ఒక కారణం కాగా.. యువత గంజాయి మత్తులో పడి దారుణాలకు ఒడిగడుతుండటం మరో కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామాల్ని విజిట్ చేయండి..
ప్రతి రోజూ గ్రామాల్ని విజట్ చేయండి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టండి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపండి. –ఇటీవల జరిగిన రివ్యూలో ఎస్పీ మహేశ్వర రెడ్డి
క్షేత్ర స్థాయిలో మాత్రం పోలీసు సిబ్బంది అంతగా పర్యటించడం లేదనేందుకు ఈ రెండు ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. గ్రామాల్ని విజిట్ చేస్తే ఈ రెండు ఘటనలూ జరిగేవే కాదంటున్నారు స్థానికులు.
ప్రశ్నార్థకంగా మారిన మహిళల భద్రత
ఈ ఏడాది మార్చిలో నరసన్నపేట బొంతలవీధికి చెందిన గున్నమ్మ(85) అనే వృద్ధురాలిని వివస్త్రగా చేసి మరీ కిరాతకంగా హత్య చేశారు. వ్యసనాల బారిన పడిన ఓ బాలుడు వృద్ధురాలు ధరించిన తులం బంగారు ఆభరణాల కోసమే హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు.
జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలో పొందూరుకు చెందిన 52 ఏళ్ల వివాహితను పరిచయమున్న యువకుడే రూమ్‌కు పిలిపించు కుని మరీ హత్య చేశాడు. మద్యంమత్తులో ఉన్న యువకుడు మహిళ ధరించిన బంగారం దోచు కునేందుకు యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో తలగడను ముఖంపై ఊపిరాడకుండా ఉంచి హత్య చేశాడని నిర్ధారించారు. ఆ యువకుడికి విపరీతంగా గంజాయి తాగే అలవాటుందని స్థానికులు చెప్పడం గమనార్హం.
ఈ ఏడాది జూలైలో జిల్లాకేంద్రంలోని బాలాజీనగర్‌లో వృద్ధురాలిని బెదిరించి చైన్ దొంగిలించారు.
కవిటి మండలం వింద్యగిరి సమీపంలో నాలుగురోడ్ల కూడలి వద్ద ఓ మహిళా ఉపాధ్యాయురాలి తలపై రాయితో దాడి చేసి బంగారాన్ని కాజేసే ప్రయత్నం చేశారు.
వజ్రపుకొత్తూరు మండలంలో ఓ మహిళను హత్య చేసి బంగారాన్ని దోచుకున్నారు.
కొన్ని ఘటనలు..
కొన్ని ఘటనలు..


