థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోవాలని, లేకుంటే ప్రతిఘటన తప్పదని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్ దొర, కార్యదర్శి సవర సింహాచలం, పోరాట కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం అన్నంపేట పంచాయతీ జంగాలపాడు గిరిజన గ్రామంలో ప్రతులను దహనం చేశారు. సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లాంట్ నిర్మాణం చేపట్టి తమ బతుకులు బుగ్గిపాలు చేయవద్దన్నారు. నిరసన కార్యక్రమంలో పోరాట కమిటీ సభ్యులు సవర మిన్నారావు, మనోజ్, కూర్మారావు, లక్ష్మణరావు, నాగేశ్వరరావు, రామలింగం తదితరులు పాల్గొన్నారు. – బూర్జ


