నడిపించే కొడుకుండగా..
● కళ్లు లేకుంటేనేం..
తల్లిదండ్రులకు చూపు లేకపోయినా దారి చూపేందుకు నేనున్నానంటూ ఆ కుమారుడు ముందుకొచ్చాడు. బుధవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు దగ్గరుండి తీసుకెళ్లాడు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రజాప్రతినిధుల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. నగరానికి చెందిన అంధ దంపతులు రాజు, జ్యోతి, వారి కుమారుడు సాల్మన్‌రాజ్‌లను ఇక్కడి చిత్రంలో చూడొచ్చు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం


