పుణ్యక్షేత్రాల జాబితా సిద్ధం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పుణ్యక్షేత్రాల జాబితాను వారం రోజుల్లో సిద్ధం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దేవదాయ శాఖ ఈఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, జాతర వివరాలను సిద్ధం చేయాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రథసప్తమికి వచ్చే భక్తులు జిల్లాలో ఇతర పుణ్య క్షేత్రాలనూ సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
బుడితి వస్తువుల
మార్కెటింగ్‌కు చర్యలు
సారవకోట: బుడితిలోని కంచు, ఇత్తడి గృహోపకరణాల మార్కెటింగ్‌కు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం బుడితిలో లేపాక్షి ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త తరానికి అవసరమైన నూతన గృహోపకరణాలు తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, తహశీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ మోహన్‌కుమార్, ఈఓపీఆర్డీ అప్పన్న పాల్గొన్నారు.
తాళ్లవలస గ్రామస్తులకు
రక్త పరీక్షలు
సంతబొమ్మాళి: తాళ్లవలసలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో బుధవారం 50 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగిటివ్‌గా వచ్చిందని దండుగోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గంగాధర్ విశ్వనాథ్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. డయేరియా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు.
లా కోర్సు స్పాట్ అడ్మిషన్లు వాయిదా
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల లా కోర్సులో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 4న జరగాల్సిన స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ బి.అడ్డయ్య బుధవారం తెలిపారు. వాస్తవానికి, గురువారం విద్యార్థుల సర్టి ఫికెట్ల పరిశీలన పూర్తిచేయాల్సి ఉందని, అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు చెప్పారు. తదుపరి తేదీ తర్వాత ప్రకటిస్తామని, విద్యార్థులు గమనించాలని కోరారు.
ఆరడుగుల ‘ఈల్ ఫిష్’
పోలాకి: గుప్పెడుపేట సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు బుధవారం ఆరడుగుల పొడవైన అరుదైన ఈల్‌ఫిష్ చిక్కింది. పాముని పోలి ఉండటంతో మార్కెట్‌లో అమ్మకానికి తీసుకెళ్లబోమని మత్స్యకారులు తెలిపారు. ఎంగ్విలా అనే శాసీ్త్రయనామం కలిగిన ఈ చేపను కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆహారంగా తీసుకుంటారని ఫిషరీష్ అసిస్టెంట్ హెచ్.ఢిల్లీశ్వరరావు తెలిపారు.
పుణ్యక్షేత్రాల జాబితా సిద్ధం చేయాలి
పుణ్యక్షేత్రాల జాబితా సిద్ధం చేయాలి


