
కలం గళంలో నిరసన స్వరం
బ్రిటిష్ పాలనకు వారసత్వం..
ఒక ఎడిటర్ ఇంట్లో పోలీస్ సోదాలు బ్రిటిష్ పాలనా కాలంలో జరిగాయని చదివాం. స్వాతంత్య్ర భారత చరిత్రలో ఇలా ఏనాడూ జరగలేదు. కూటమి ప్రభుత్వం సొంత రాజ్యాంగం తయారు చేసుకుందే మో. డాక్టర్ అంబేడ్కర్ చూపుడు వేలులా ప్రశ్న జీవిస్తూనే ఉంటుంది. ఎడిటర్ ఇంట్లో అక్షరాలు తప్ప మారణాయుధాలు ఉండవు గదా.. కూటమి ప్రభుత్వం బాగా దిగజారిపోతోంది. – నల్లి ధర్మారావు,
స్సామ్నా రాష్ట్ర అధ్యక్షులు
అక్రమ సోదాలు సరికాదు..
రాజకీయ రెడ్ బుక్ తెరిచి జర్నలిస్టులు, ఎడిటర్లపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎవరిది తప్పుంటే వారిపై న్యాయస్థానాలు అంతిమ తీర్పు వెలువరిస్తాయి. ఇలా దాడులు చేయడం రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే.
– కొంక్యాణ వేణుగోపాల్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి
సర్కారు నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ధిక్కార స్వరమొకటి వినిపించింది. పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడికి నిరసనగా అక్షర శరమొకటి హెచ్చరిక జారీ చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగిస్తూ కలాలన్నీ గళమెత్తాయి. అణచివేత ప్రభుత్వ నైజమైతే.. పోరాటం పాత్రికేయుల పంథా అని తెలియజేస్తూ జిల్లావ్యాప్తంగా మీడియా ప్రతినిధులు ఆందోళనలు చేశారు. ‘సాక్షి’ ఎడిటర్‌పై ప్రభుత్వ కక్ష సాధింపులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
●
భయభ్రాంతులకు గురిచేస్తూ..
● ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయ రెడ్డి
ఇంటిలో పోలీసుల అక్రమ సోదాలపై అక్షరాగ్రహం
● కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడిన శ్రీకాకుళం జర్నలిస్టు సంఘాలు
సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వం పూర్తి కక్ష పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఎటువంటి సెర్చ్ వారెంటు లేకుండా, నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో పోలీసులు సోదాలు జరిపి గంటల తరబడి తలుపులు మూసి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు.
– ఎన్.ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
శ్రీకాకుళం/శ్రీకాకుళం క్రైమ్ :
‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసుల అక్రమ సోదాలకు నిరసనగా పాత్రికేయ లోకం గళమెత్తింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో జిల్లా జర్నలిస్టు సంఘాలు నల్ల రిబ్బన్లు కట్టుకుని, చేతిలో ప్లకార్డులతో ధర్నా చేసి నిరసన తెలిపాయి. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీగా స్థానిక తహసీల్దారు కార్యాలయానికి వెళ్లారు. ఎడిటర్ ధనుంజయరెడ్డికి సంఘీభావాన్ని తెలుపుతూ.. ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరు తూ డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఒకప్పటి బ్రిటిష్ పాలనకు వారసత్వపు హక్కులా ప్రస్తుత కూటమి పాలన ఉందని, పూర్తి కక్షసాధింపు చర్యలకు దిగుతుందని, రాజకీయ రెడ్‌బుక్ తెరిచి పత్రికా ఎడిటర్లు, జర్నలిస్టులపై అరాచక విధానానికి సరికొత్త నాంది పలుకుతున్నారని శ్రీకాకుళం జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సెర్చ్ వారెంటు లేకుండా గురువారం ఉదయం విజయవాడలోని ఆయన నివాస గృహంలో పోలీసులు సోదాలు జరపడం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పత్రి కా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమేనన్నారు. కార్యక్ర మంలో ఏపీడబ్లూజేఎఫ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కొంక్యాణ వేణుగోపాల్,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్న లిస్ట్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎన్.ఈశ్వరరావు, సాక్షి ఎడిషన్ ఇన్‌చార్జిలు కడారి రాజా, పి.చినప్పలనాయుడు, టీవీ బ్యూరో సునీల్, సీనియర్ జర్నలిస్టులు యు.శ్రీనివాస్, వీవీఎన్ శ్రీనివాస్, బగాది అప్పలనాయు డు, శివప్రసాద్, భీమారావు, షణ్ముఖ, రవి, అప్పలనాయుడు, రామకృష్ణ, భీమారావు, జగదీష్ పాల్గొన్నారు.
డిప్యూటీ తహిసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు
కక్ష సాధింపు మంచిది కాదు
కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ప్రశ్నిస్తున్న సాక్షి పత్రికపై కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు నమోదు చేయడం, అక్రమ సోదాలు వంటి అప్రజాస్వామ్యకమైన చర్యలు సరికాదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సాక్షి దినపత్రిక గొంతు నొక్కే ప్రయత్నంగా ఎడిటర్‌పై బెదిరింపులకు పాల్పడుతున్నారు.
– పేరాడ తిలక్, వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి
ముమ్మాటికీ కుట్రపూరిత చర్యే..
ఎన్నికల మునుపు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ అక్రమాలపై కథనాలు రాస్తున్న సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కుంటి సాకులతో అక్రమంగా సోదాలు చేయడం కుట్ర పూరిత చర్య అని అందరికీ అర్థమైంది.
– సింగుపురం మోహన రావు, న్యాయవాది,వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, టెక్కలి
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
ఏపీలో పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వం ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు చేయడం మంచి పద్ధతి కాదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఎడిటర్ ఇంటిలోకి వెళ్లి సోదాలు చేయడం మంచి పద్ధతి కాదు.
– పేడాడ శ్రీరామమూర్తి, న్యాయవాది,
వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి

కలం గళంలో నిరసన స్వరం

కలం గళంలో నిరసన స్వరం

కలం గళంలో నిరసన స్వరం

కలం గళంలో నిరసన స్వరం

కలం గళంలో నిరసన స్వరం

కలం గళంలో నిరసన స్వరం

కలం గళంలో నిరసన స్వరం

కలం గళంలో నిరసన స్వరం