ఊసే లేని దత్తత | - | Sakshi
Sakshi News home page

ఊసే లేని దత్తత

Dec 4 2025 9:09 AM | Updated on Dec 4 2025 9:09 AM

ఊసే లేని దత్తత

ఊసే లేని దత్తత

‘‘మనతోపాటు పుట్టినవాడికి తిండిలేదు, మనం పెద్ద పెద్ద ప్యాలెసుల్లో ఉంటే.. వాడికేమో ఇల్లు లేదు. మీలో చాలా మంది సమాజం వల్ల పైకి వచ్చారు. కాబట్టి తిరిగి దానికి ఎంతో కొంత ఇవ్వాలి. పేదవాళ్లుగానే ఉన్న మీతోటి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యతను సంపన్నులు తీసుకోవాలి. దీనిని ప్రభుత్వం పర్యవేక్షించాలనే ‘మార్గదర్శి–బంగారు కుటుంబం.. పీ4–జీరో పావర్టీ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’. – ఈ ఏడాది మార్చి 31న పీ4–జీరో పావర్టీ కార్యక్రమం ప్రారంభంలో సీఎం చంద్రబాబు

పుట్టపర్తి అర్బన్‌: సంపద సృష్టిస్తానని చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు.. పేదలను ఆదుకునేందుకు సంపన్నుల వెంట పడ్డారు. పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా బంగారు కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తామని గొప్పలకు పోయారు. పీ–4కు ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేసి పేదల ఇళ్లలో కొత్త వెలుగులు నింపుతామని ఆర్భాటంగా ప్రకటించారు. చివరకు అక్క, చెల్లెమ్మలకు మొండి చెయ్యి చూపారు. దీంతో పీ4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించాలనే కార్యక్రమం కాస్త అటకెక్కింది. ఇందుకోసం పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయం వెనుక పీ4 సర్వే అధికారుల కోసం సిద్ధం చేసిన భవనం తలుపులు నేటికీ తెరుచుకోలేదు.

కార్యక్రమం ఉద్దేశం ఇదే...

సంపన్న వర్గాల్లోని 10 శాతం మంది.. అట్టడుగున ఉన్న 20 శాతం మందిని దత్తత తీసుకుని వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే పీ–4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దత్తత తీసుకునే వారిని మార్గదర్శులు అని.. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా పేర్కొంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నిబంధన మేరకు ఒక్కో మార్గ దర్శకుడు కనీసం నాలుగు కుటుంబాలను దత్తతకు తీసుకోవాల్సి ఉంది. గుర్తించిన బంగారు కుటుంబాలకు ఆర్థికేతర మద్దతు ఇవ్వాల్సి ఉంది. అంటే విద్య, వ్యవసాయం, మార్గదర్శకత్వం, ఆర్థిక ప్రణాళిక, సాంకేతికత, నిర్మాణం, చట్టపరమైన సహాయం అందించాలి. ఆర్థిక మద్దతు కింద దత్తత తీసుకున్న కుటుంబాలకు ప్రతి నెలా నిత్యావసరాలకు కనీసం రూ.500, జీవనోపాధికి రూ.5వేలు. ఆర్థిక సహాయం అందించాలి. అయితే మార్గదర్శుల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక్కడే తిరకాసు మొదలైంది. రాష్ట్రంలోనే అత్యధిక సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉన్న సీఎం చంద్రబాబు ముందుగా పేదలను దత్తత తీసుకోవాల్సి ఉండగా... ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. నీతులు పరుల కోసమేననే ధోరణితో దత్తత భారాన్ని సంపన్నుల నెత్తిన రుద్దారు. 10 నెలలుగా అవగాహన సదస్సులు, సర్వేలు చేయించారు. అయినా దత్తతకు సంపన్నులు, అధికారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇప్పటికే సర్వే ద్వారా గుర్తించి బంగారు కుటుంబాలకు సాంత్వన ఎన్నడనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో మొత్తం 46,209 బంగారు కుటుంబాలను, 5,893 మంది మార్గదర్శకులను అధికారులు గుర్తించారు. అయితే ఏ మండలంలో ఎంత మందిని, ఏ గ్రామంలో ఎవరిని గుర్తించారనే వివరాలను అధికారులు వెల్లడించలేక పోతున్నారు.

పేదల దత్తతకు ముందుకు రాని

ధనికులు, ఉద్యోగులు

బంగారు కుటుంబాలకు

దక్కని సాంత్వన

పేదల్లో ఆశలు రేపి

మిన్నుకుండిపోయిన ప్రభుత్వం

సైట్‌ ఓపెన్‌ కావడం లేదు

పేదలను ఆదుకునే పీ4–జీరో పావర్టీ కార్యక్రమం ఖర్చుతో కూడుకున్నది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూపొందించిన వెబ్‌ సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. ప్రస్తుతం గుర్తించిన మార్గదర్శకులు, బంగారు కుటుంబాల లబ్ధిదారులకు సలహాలు, సూచనలు మాత్రం ఇస్తున్నాం.

– విజయ్‌కుమార్‌, సీపీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement