వెంటనే మిషన్లు ఇవ్వాలి
కదిరిలో ఎలాంటి పరిశ్రమలు లేవు. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు ఇంటివద్దనే నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు కుట్టు శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికి రెండు నెలలు దాటినా ప్రభుత్వం మిషన్లు ఇవ్వలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మిషన్లు పంపిణీ చేయాలి. – సలీమా, వైఎస్సార్ సీపీ
మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు, కదిరి
త్వరలో మిషన్లు వస్తాయి
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కుట్టుపై శిక్షణ ఇచ్చింది. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు త్వరలోనే మిషన్లు అందజేస్తాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా మిషన్లు ఇవ్వలేదు.
– రామసుబ్బారెడ్డి, ఈడీ, బీసీ కార్పొరేషన్


