షీప్ సొసైటీ ఎన్నికలకు వేళాయె
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీ)కు ఎన్నికలు నిర్వహించడానికి పశుసంవర్ధకశాఖ షీప్ డెవలప్‌మెంట్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 350 సొసైటీలు రిజిష్టర్ చేసుకోగా... అందులో డిపార్ట్‌మెంట్ యూనియన్ పరిధిలో 215 సొసైటీలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఉమ్మడి జిల్లా పరిధిలో 130 సంఘాలకు ఎన్నికలు పూర్తయినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 84 సొసైటీలకు డిసెంబర్ 5, 12న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న మదిగుబ్బ సొసైటీకి ఎన్నిక నిలిపివేశారు. 2018లో ఎన్‌సీడీసీ కింద రూ.10.66 కోట్లు రుణాల పంపిణీకి సంబంధించి సక్రమంగా కంతులు కట్టని 342 మందిని డిపాల్ట్‌ర్ జాబితాలో పెట్టినట్లు ఈ శాఖ వర్గాలు తెలిపాయి. డీ–పాల్టర్లకు ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఓటు వేయడానికి అర్హత లేదన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 45 సొసైటీలకు, శ్రీసత్యసాయి జిల్లాలో 39 సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందులో మొదటి విడత కింద ఈనెల 5న 55 సొసైటీలకు, రెండో విడతగా ఈనెల 12న 29 సొసైటీలకు ఎన్నిక జరగనుంది. వెటర్నరీ డాక్టర్లు (వీఏఎస్) ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఒక్కో సొసైటీలో ఏడు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి తర్వాత ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నట్లు షీప్ డెవలప్‌మెంట్ ఏడీ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి తెలిపారు.
రేపు తొలివిడతగా 55 సొసైటీలకు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు (శుక్రవారం) తొలివిడతగా 55 షీప్ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో మందనకుంట, ధేమకేతేపల్లి, గౌనివారిపల్లి, బాలంపల్లి, చలివెందుల, పరిగి, చాలకూరు, మాగేచెరువు, పత్తికుంటపల్లి, సోమందేపల్లి, గొడ్డువెలగల, డబురువారిపల్లి, వంచిరెడ్డిపల్లి, వెంకటగిరిపాలెం, రాంపురం, వెంగలమ్మచెరువు, కోగిర, ఎం.కొత్తపల్లి, రొద్దం, తురకలాపట్నం, యర్రాయపల్లి, హరియాణ్‌చెరువు, బిల్వంపల్లి, దాదులూరు, భానుకోట, కొండపల్లి, కేఎన్ పాళ్యం, తగరకుంట, గంగరెడ్డిపల్లి, దుబ్బార్లపల్లి సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
12న మిగతా సొసైటీలకు..
రెండో విడత కింద ఈ నెల 12న శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, మామిళ్లపల్లి, పర్వతదేవరపల్లి, కొడపగానిపల్లి, రామస్వామితాండ, నసనకోట, పి,కొత్తపల్లి, ఆత్మకూరు సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
రేపు 55 సొసైటీలకు,
12న 29 సొసైటీలకు ఎన్నికలు
సొసైటీలను దక్కించుకునేందుకు
అధికార పార్టీ ఎత్తులు


