పుట్టపర్తి మీదుగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్
గుంతకల్లు: బెంగళూరు–కలబురిగి మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను శ్రీ సత్యసాయి పుట్టపర్తి మీదుగా మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి కలబురిగి జంక్షన్ నుంచి ఈ రైలు (22231) ఉదయం 6.10కి బయలుదేరి 6.48 గంటలకు యాదగిరి, 7.38కి రాయచూర్, 9.00 గంటలకు గుంతకల్లు జంక్షన్, 10.03 గంటలకు అనంతపురం, 11 గంటలకు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, మధ్యాహ్నం 2.10 గంటలకు బెంగళూరు జంక్షన్‌కు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో జనవరి 2 మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు జంక్షన్ (22232) నుంచి బయలుదేరి సాయంత్రం 4.23 గంటలకు శ్రీసత్యసాయి పుట్టపర్తి ప్రశాంతి నిలయం, 5.33 గంటలకు అనంతపురం, 6.37 గంటలకు గుంతకల్లు, రాత్రి 8.18 గంటలకు రాయచూర్, రాత్రి 10.45 గంటలకు కలబురిగి జంక్షన్‌కు చేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
ఏడుగురు విద్యార్థుల డీబార్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న యూజీ మూడు, ఐదు సెమిస్టర్ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డీబార్ అయ్యారు. బుధవారం జరిగిన పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన ఏడుగురు విద్యార్థులను డీబార్ చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. హిందూపురంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురిని బుక్ చేశామన్నారు.
ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
రొద్దం: ‘‘పెద్దగువ్వలపల్లి గ్రామ సమీపాన అగ్రిగోల్డ్ సంస్థ పెంచిన నీలగిరి చెట్లను మంత్రి సవిత అనుచరులు నరుకుతుంటే.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఉన్పర ఉప్పేంద్ర, శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీన్ని సహించలేని టీడీపీ నాయకులు మా కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు... ప్రశ్నిస్తే దాడులు చేస్తారా’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. బుధవారం ఆమె మండలంలోని గోనిమేకులపల్లిలో పర్యటించారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చిన్నప్పయ్య కుమారుడు హరీష్ ఫోన్ చేసి బెదిరించారన్నారు. మంత్రి అండతో టీడీపీ నాయకులు మండలంలోని ప్రకృతి వనురులను దోచుకుంటున్నారన్నారు. ఈ దారుణాల గురించి ఎస్‌ఐకి ఫోన్ చేసి చెప్పినా, పట్టించుకోలేదన్నారు. కనీసం ఇప్పటికైనా స్పందించి అక్రమంగా చెట్లను నరుకుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మరోసారి వైఎస్సార్ సీపీ జోలికోస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
యక్షిత్.. అరుదైన ఘనత
పెనుకొండ: పట్టణానికి చెందిన టీడీ యక్షిత్ అరుదైన ఘనత సాధించాడు. స్థానిక బ్రిలియన్స్ స్కూల్‌లో చదువుకుంటున్న యక్షిత్ అక్టోబర్ 5న చైన్నెలో ప్రపంచ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అతిపెద్ద కరాటే ప్రదర్శనలో పాల్గొన్నాడు. 863 మందితో నిర్వహించిన ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కగా..అందులో పాల్గొన్న యక్షిత్‌కు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు సర్టిఫికెట్ పంపారు. బుధవారం పెనుకొండలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సవిత సర్టిఫికెట్‌ను యక్షిత్‌కు అందించి అభినందించారు. అలాగే యక్షిత్‌కు శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ రామచంద్రను కూడా ప్రశంసించారు.
పుట్టపర్తి మీదుగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్
పుట్టపర్తి మీదుగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్


