సాయి ప్రేమే శ్రీరామ రక్ష
ప్రశాంతి నిలయం: ప్రేమతత్వంతో సత్యసాయి భక్తకోటిని ఆదరించాడని, ఆయనే ప్రేమే సకల జనులకు శ్రీరామ రక్ష అన్న సందేశాన్నిస్తూ చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మైమరపించాయి. పర్తియాత్రలో భాగంగా సింగపూర్ సత్యసాయి భక్తులు బుధవారం పుట్టపర్తికి విచ్చేశారు. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి సింగపూర్ విద్యాసంస్థల చిన్నారులు ‘సర్కిల్ ఆఫ్ లవ్’ పేరుతో నాటిక ప్రదర్శించారు. సత్యసాయి చూపిన ప్రేమ మార్గాన్ని వివరిస్తూ చక్కటి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు.
సాయి ప్రేమే శ్రీరామ రక్ష


