మామిడి రైతులకు ‘పూత టెన్షన్’
తలుపుల: మామిడి రైతులకు ఈ ఏడాది కూడా నష్టాలు తప్పేలా లేవు. రాలిపోతున్న మామిడి పూత రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొద్దిపాటి పూత వచ్చిన తోటలకు కూడా దిత్వా తుపాను దెబ్బ తగిలింది.
49,870 ఎకరాల్లో తోటలు
జిల్లా వ్యాప్తంగా సుమారు 49,870 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేశారు. ఇప్పటి వరకూ మామిడి తోటల్లో చెట్లకు పూత కనిపించడం లేదు. ఈ పాటికి పూత దశలో ఉండాల్సిన మామిడి తోటలు ఖాళీ చెట్లతో వెలవెలలాడుతున్నాయి. గత ఏడాది మామిడి ధర ఉన్నప్పటికీ పురుగులు, తెగుళ్ల అకాల వర్షాలతో కాయలు నాణ్యత లేకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధర పతనమైంది. దీనివలన కోతకు వచ్చినా ధరలు లేక మామిడి కోత కోయకుండా వదిలేశారు. కాయలు కోయక చెట్లలోనే ఉండిపోవడంతో చెట్లలో బలం తగ్గిపోయి ఈఏడాది పూతలు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా పూత వచ్చే అవకావంలేదని, మరో ఏడాది వరకూ వేచి చూడాల్సిన చూడాల్సిందేనంటున్నారు.
ఏటా నష్టాలే..
ఈఏడాది పూత పరిస్థితిని బట్టి 30 శాతం కూడా వచ్చేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అక్కడక్కడా కొద్ది పాటి పూత వచ్చినా దిత్వా తుపాను దెబ్బకు పూత రాలిపోతందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది దిశ తుపాను దెబ్బకు జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల మంది రైతులు తమ తోటల్లో సుమారు లక్ష టన్నులు దిగుబడి వచ్చినా అమ్ముకోలేక నష్టపోయారు.
పరిహారమివ్వని చంద్రబాబు ప్రభుత్వం
జిల్లా వ్యాప్తంగా గత ఏడాది పురుగులు, తెగుళ్లతో అకాల వర్షాలకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఫసల్ బీమా కింద రైతులను ఆదుకుంటామని ప్రభుత్వాలు ఆర్భాట ప్రచారాలు చేశాయి. న్యాయం జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా 2,353 మంది మామిడి సాగు రైతులు 5032 ఎకరాలకు ఫసల్ బీమా చేశారు. అధికారులు సైతం నష్టాన్ని అంచనా వేసి రిపోర్టులు పంపారు. అయితే నేటికీ నష్టపరిహారం మాత్రం అన్నదాతలకు అందలేదు.
80 శాతం మామిడి తోటల్లో కనిపించని పూత
గత ఏడాది తుపానుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం
వరుస నష్టాలతో అన్నదాతల అవస్థలు
మామిడి రైతులకు ‘పూత టెన్షన్’


