అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయండి
● ఎస్పీ సతీష్‌కుమార్
ధర్మవరం అర్బన్: అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత పోలీసులదేనని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సతీష్‌కుమార్ తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికలకు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. అక్రమ మద్యం, ఇసుక, మట్కా, గుట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. అవినీతికి తావులేకుండా అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఎస్పీతోపాటు ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, టూటౌన్ సీఐ రెడ్డెప్ప, సీసీ చిరంజీవి, ఎస్‌ఐ వెంకటరాముడు, సిబ్బంది ఉన్నారు.
అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేసి నిరసన
కనగానపల్లి: మండలంలోని మద్దెలచెరువు తండాలోని అంగన్‌వాడీ కేంద్రానికి మంగళవారం స్థానికులు తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు. అంగన్‌వాడీ కార్యకర్త చెక్కరమ్మ సెలవులో వెళ్లడంతో ఆయా లలితాబాయి విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఈ సందర్భంగా గ్రామస్తులు రుక్మిణి, గోపాల్‌నాయక్, వెంకటేష్ నాయక్, చిట్టెమ్మ ఆరోపించారు. ఆమైపె ఇప్పటికే నాటుసారా కేసులు ఉన్నాయని తెలిపారు. అయినా తన తీరు మార్చుకోక ఏకంగా కేంద్రంలోనే అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపిందని మండిపడ్డారు. ఈ విషయంపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఆయాను మార్చే వరకూ కేంద్రానికి పిల్లలను పంపేది లేదని తేల్చిచెప్పారు. కాగా, ఈ విషయంపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లతాకిరణ్‌ను వివరణ కోరగా.. త్వరలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయాపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయండి


