పొలం మొత్తం దున్నేశారు
ముచ్చురామి గ్రామంలో 2.50 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న మామిడి, ఉసిరి, నేరేడు మొక్కలను చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నరుకుతూనే ఉన్నారు. ఆ స్థానంలో కొత్తమొక్కలు పెట్టుకుని సాగుచేస్తుంటే రెండు రోజుల కింద 150 మొక్కలను నరికేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ ఆదివారం రోజున ఏకంగా పొలం మొత్తం ట్రాక్టర్లతో దున్నేశారు. జనసేన నాయకుడు గుర్రప్ప అనుచరులతో వచ్చి మా పొలాన్ని దున్నేశారు.
– రామ్మోహన్‌రెడ్డి,
ముచ్చురామి, ధర్మవరం మండలం


