
గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్
గుంతకల్లు: ప్రపంచ చదరంగ సమాఖ్య (ఎఫ్‌ఐడీఈ), అఖిల భారత చదరంగ సమాఖ్య (ఏఐసీఎఫ్) సంయుక్తంగా మంగళవారం విడుదల చేసిన చదరంగ క్రీడాకారుల రేటింగ్ జాబితాలో గుంతకల్లు చెందిన ఐదుగురు క్రీడాకారులకు అంతర్జాతీయ రేటింగ్ దక్కింది. ఈ మేరకు కోచ్‌లు అనిల్‌కుమార్, రామారావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బాలల విభాగంలో బాలాజీ (1,472), పునీత్‌రెడ్డి (14,712), కార్తీక్ (1,493), రాఘవ (1,478) అంతర్జాతీయ రేటింగ్ దక్కించుకున్నారన్నారు. బాలికల విభాగంలో 1,401 రేటింగ్‌తో గుంతకల్లు చెస్ క్రీడా చరిత్రలో మొట్టమొదటి రేటెడ్ ప్లేయర్‌గా జువైరా రికార్డు నమోదు చేసిందని తెలిపారు.
ఈ–స్టాంపుల కుంభకోణంపై అధికారులకు సమాచారమిచ్చా
● టీడీపీ నేత ఉన్నం మారుతి చౌదరి
అనంతపురం టవర్‌క్లాక్: కళ్యాణదుర్గంలో టీడీపీ కార్యకర్త ఎర్రప్ప అలియాస్ బాబు ‘మీసేవ’ కేంద్రంగా సాగిన నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులకు తానే సమాచారం ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు, టీడీపీ నేత మారుతి చౌదరి తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎర్రప్ప మీసేవ కేంద్రంలో నకిలీ స్టాంపులు సృష్టిస్తున్నట్లు గతంలో అతని కారణంగా మీసేవ కేంద్రాలను మూసేసుకున్న వారు తన దృష్టికి తెచ్చారన్నారు. అందుకు ఆధారంగా ఉన్న పత్రాలను వాట్సాప్‌లో పంపడంతో వాటిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఇతర శాఖల అధికారులకు పంపి విచారణ చేయాల్సిందిగా కోరానన్నారు. ఈ–స్టాంపుల ట్యాంపరింగ్ ద్వారా ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతోనే తాను అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గించిన వారిని వదిలేసి పోలీసులు తనపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళతానన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి బురద జల్లుతున్నారని, ఈ కుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు.

గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్

గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్

గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్

గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్