
మోసం చంద్రబాబు నైజం
పరిగి: ‘‘మోసం చందబ్రాబు నైజం.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేశారు. అందుకే ఏడాదిలోపే ప్రజలూ ఆయన మోసాన్ని గుర్తించారు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. మంగళవారం ఆమె పరిగిలో క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ‘చంద్రబాబు ష్యూరిటీ...మోసం గ్యారెంటీ’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... ఏడాది కాలంలోనే కూటమి సర్కార్ ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలయ్యాయన్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా టీడీపీ అధినాయకత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోయామన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ప్రజలు ఒత్తిడి తేవడంతో ఆగమేఘాలపై హడావుడిగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేశారని, అయిచే ఎంతోమంది అర్హులకు అన్యాయం చేశారన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెల గడిచినా నేటికీ రైతు భరోసా పథకం సొమ్ము నయా పైసా రైతులకు అందించలేదన్నారు. అందుకే జనమంతా నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను తలచుకుంటున్నారన్నారు. కూటమి సర్కార్ ‘తల్లికి వందనం’ అంటూ గగ్గోలు పెడుతున్నా.. అందరూ ‘అమ్మ ఒడి’ గానే ప్రజలు కీర్తిస్తున్నారన్నారు. మోస పూరిత వాగ్ధా నాలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ వైఫల్యాలను గ్రామగ్రామానా వివరించేందుకే ‘చంద్రబాబు ష్యూరిటీ...మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చందబ్రాబు హయాంలో ప్రజలకు జరిగిన అన్యాయం తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
పరిగిలో ‘చంద్రబాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ’ పోస్టర్ల ఆవిష్కరణ