
సౌత్‌జోన్ పెంకాక్ సిలాట్ పోటీలకు ఎంపిక
హిందూపురం టౌన్: నంద్యాలలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెంకాక్ సిలాట్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి సౌత్‌జోన్ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల టాండింగ్ సీనియర్ విభాగంలో హిందూపురానికి చెందిన షేక్ నస్రీన్, జూనియర్ విభాగంలో శరణ్య, మదీహ, ప్రణవి, మానస మొదటి స్థానంలో నిలిచి, బంగారు పతకాలు దక్కించుకున్నారు. ఫ్రీ జూనియర్స్ విభాగంలో హిందూపురానికి చెందిన దివ్య, ఫ్రీ టీన్ విభాగంలో తన్వితారెడ్డి, మఖాన్ విభాగంలో మధుర, మీనా, ఆఫిఫా కౌసర్ బంగారు పతకాలను సాధించారు. అలాగే టాండింగ్ బాలుర జూనియర్ విభాగంలో తరుణ్ ఆదిత్య, ఫ్రీ టీన్ విభాగంలో దుర్గా స్మరన్ బంగారు పతకాన్ని, ఈశ్వర్ రజత పతకాన్ని దక్కించుకున్నారు. ప్రతిభ చాటిన వీరిని జూలై 18 నుంచి 20 వరకు తిరుచ్చిలో జరిగే సౌత్‌జోన్ పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను పెంకాక్ సిలాట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మనోజ్ సాయి, రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు రఫీక్ అహమ్మద్; ట్రెజరర్ రియాజ్ భాషా అభినందించారు.