
సోషల్ మీడియా మాయలో పడొద్దు
పుట్టపర్తి టౌన్: సోషల్ మీడియా మాయలో పడి భవిష్యత్తును నాశనం చేసుకోరాదని బాలికలకు ఎస్పీ రత్న సూచించారు. ఈగల్ క్లబ్, శక్తి యాప్ వినియోగంపై బుదవారం కొత్తచెరువులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు, చిన్న వయస్సులో కలిగే ప్రేమ ఆకర్షణ, గంజాయి వలన కలిగే అనర్థాలపై చైతన్య పరిచారు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ మొదలైన సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ చదువులపైనే మనసు పెట్టాలన్నారు. బాలికలు, మహిళలు ప్రమాదంలో ఉంటే 79934 85111 కు సమాచారం అందిస్తే శక్తి టీం సభ్యులు సకాలంలో చేరుకుని రక్షణ కల్పిస్తారన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు సేవిస్తున్నట్లు తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. బాలికలు అన్ని రంగాల్లో సమాన ప్రతిభతో రాణించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి కొత్తచెరువు సీఐ మారుతీశంకర్, ఎస్‌ఐలు గోపీనాఽథ్‌రెడ్డి, లింగన్న, కృష్ణమూర్తితో పాటు శక్తిం టీం సభ్యులు పాల్గొన్నారు.
బాలికలకు ఎస్పీ రత్న సూచన