
నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు
కదిరి: మరణానంతరం నేత్రదానంతో మరో ఇద్దరికి కంటి చూపునివ్వాలనే సదుద్దేశ్యంతో ఓ మహిళ తన నేత్రాలను దానం చేసింది. వివరాలు.. అనారోగ్యంతో బాధపడుతున్న కదిరిలోని అడపాలవీధికి చెందిన పద్మావతమ్మ(75) బెంగుళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. అయితే తాను మరణించాక తన నేత్రాలను దానం చేయాలని ఆమె జీవించి ఉన్న సమయంలోనే కోరడంతో ఆ మేరకు కుటుంబసభ్యులు స్పందిస్తూ ఆమె నేత్రాలను బెంగళూరులోని శంకర్ నేత్రాలయానికి అందజేశారు. ఆమెకు భర్త వెంకటరెడ్డి (సెరికల్చర్ విశ్రాంత ఉద్యోగి), కుమారువు దేవనందన్‌రెడ్డి, కుమార్తె శ్రీదేవి ఉన్నారు. ఆమె అంత్యక్రియలను బుధవారం ఉదయం 9 గంటలకు కదిరిలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు