
తాగుడులో తగ్గేదేలా..
మందుబాబులు మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. నిరంతరాయంగా మందు దొరుకుతోంది. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కోరుకున్న బ్రాండ్ చేతికి చేరుతోంది. ప్రశాంతంగా తాగడానికి.. దోస్తులతో కలిసి విందు చేసుకోవడానికి వైన్‌షాపుల వద్ద సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మందు తాగుతూ ముక్క తింటూ ‘స్వర్గం’లో తేలియాడుతున్నారు. కూటమి పాలనలో మందుబాబుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.సంపాదించిన సొమ్మంతా తాగుడుకే తగలేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం విక్రయాలు దూసుకుపోతున్నాయి.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు ‘మద్యం పురం’గా మారిందన్న విమర్శలున్నాయి. విచ్చలవిడి మద్యం కారణంగా గ్రామాల్లో ఇప్పటికే గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ మద్యం వినియోగం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. గత ప్రభుత్వ హయాంలో బహిరంగ మద్యపానం, బెల్టుషాపులు, పర్మిట్ రూములపై ఉక్కుపాదం మోపడంతో మద్యం నియంత్రణలో ఉండేది. కూటమి సర్కారు రాగానే ఎమ్మెల్యేల చేతుల్లోనే మద్యం షాపులు ఉండటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం నడుస్తోంది. తెల్లవార్లూ మద్యం అమ్ముతున్నా అడిగే నాథుడే లేరు. ‘సంపద సృష్టిస్తా.. అది పేదలకే పంచుతా’ అని పదే పదే చెప్పే చంద్రబాబు..ఇక్కడ మద్యం ద్వారా పేద ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఊపందుకున్న మద్యం విక్రయాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయనేందుకు ఈ లెక్కలే ఉదాహరణ. రెండు జిల్లాల్లో గడిచిన 7 నెలల 25 రోజుల్లో రూ.1,000 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మారు. ఊరూరా బెల్టుషాపులు, అర్బన్ ప్రాంతాల్లో పర్మిట్ రూములతో మూడు పువ్వులు ఆరుకాయలుగా మద్యం వ్యాపారం జరుగుతోంది.
అర్బన్‌లోనే ఎక్కువ..
తాజా గణాంకాలను చూస్తే పట్టణాల్లో మద్యం వినియోగం మరింత ఎక్కువైంది. కొత్తగా మద్యం వినియోగదారులు పెరుగుతున్నారు. అనంతపురం జిల్లాలో రూ.646 కోట్ల విలువైన మద్యం వినియోగం కాగా.. అనంతపురం నగరంలోనే రూ.215 కోట్లకు పైగా మద్యం అమ్ముడైంది. తాడిపత్రిలో రూ.84 కోట్లు, గుత్తిలో రూ.63 కోట్లు, గుంతకల్లులో రూ. 61 కోట్ల మద్యం వినియోగమైంది. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంలో రూ.86 కోట్లు, హిందూపురంలో రూ.57 కోట్లు, పెనుకొండలో రూ.61 కోట్లు, కదిరిలో రూ.54 కోట్ల విలువైన మద్యం వినియోగమైంది. ఊరూరా బెల్టుషాపుల కారణంగా మద్యం విచ్చలవిడిగా తాగుతున్నట్టు వెల్లడైంది.
మద్యం వినియోగం (లీటర్లలో)
బీరు వినియోగం (లీటర్లలో)
మద్యం, బీరు వినియోగం విలువ
రోజుకు మద్యం కోసం చేస్తున్న వ్యయం
అనంతపురం జిల్లాలో మద్యం వ్యయం
శ్రీసత్యసాయి జిల్లాలో మద్యం వ్యయం
8 నెలల్లో రూ.1,000 కోట్ల వ్యయం
ఇదీ ఉమ్మడి జిల్లాలో మద్యం వినియోగం
రూ.215 కోట్లతో
అనంతపురం అగ్రస్థానం
రూ.84 కోట్లతో
రెండో స్థానంలో తాడిపత్రి