
యంత్రం తగిలి వృద్ధుడి మృతి
గాండ్లపెంట: మండలంలోని జీనులకుంట గ్రామంలో అజాక్స్ యంత్రం తగిలి వి.వేమన్న గౌడ్ (75) మృతిచెందాడు. ఆయనకు భార్య చిట్టెమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. వివరాలు.. జీనులకుంటలోని ప్రాథమిక పాఠశాల వద్ద సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అజాక్స్ యంత్రంలో కంకర, సిమెంట్ వేసి కలుపుతుండగా వెనుక వైపున ఉన్న వేమన్న ఎడమకాలుకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స అందేలోపు మృతి చెందాడు. మృతుని కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
చేపల వేటకు వెళ్లి..
లింగాల: కదిరి మండలం చెలంకూరుపల్లికి చెందిన బెల్లం హైదర్‌వలి (58) వైఎస్సార్ జిల్లా లింగాల మండలం కామసముద్రం గ్రామంలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న ఆయన శుక్రవారం కామసముద్రం గ్రామ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో చెరువు గట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు నీటిలోకి పడిన హైదర్‌వలికి ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. కుమారుడు బాబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.
బైక్‌పై నుంచి జారి పడి..
అగళి: ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... అగళి మండలం మధూడి గ్రామానికి చెందిన సిద్ధగంగమ్మ (48)కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భర్త తిప్పేస్వామితో పాటు కుమారుడు మంజునాథ్ మృతి చెందారు. కుమార్తె కాంచనకు పెళ్లి చేయడంతో ఆమె బెంగళూరులో స్థిరపడి ఓ గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తోంది. గ్రామంలోనే సిద్ధగంగమ్మ వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం నరసంబూధి గ్రామంలో తోటలో పూలు విడిపించేందుకు వెళ్లిన ఆమె పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యంలో పిల్లి అడ్డుగా రావడంతో వాహనం అదుపు తిప్ప కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను కర్ణాటకలోని శిరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై అగళి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా నరసింహమూర్తి
హిందూపురం టౌన్: ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా హిందూపురానికి చెందిన నరసింహమూర్తి ఎన్నికయ్యారు. శుక్రవారం పుట్టపర్తిలో జరిగిన సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు సాగిస్తామని అన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహేంద్ర
కదిరి అర్బన్: ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహేంద్ర ఎన్నికయ్యారు.తన నియామకానికి సహకరించిన ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు.
తాగునీటి సమస్య తీర్చాలంటూ మహిళల ధర్నా
గుడిబండ: మండల పరిధిలోని రాళ్లపల్లి హరిజన కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య తీర్చాలంటూ గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. లో ఓల్జేజ్ సమస్య కారణంగా రోజూ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.సమస్య పరిష్కారానికి అదనపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.
డీఎస్సీకి ఆన్‌లైన్ శిక్షణ
లేపాక్షి: త్వరలో జరిగే డీఎస్సీకి సంబంధించి అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ, సాఽధికారిత అధికారి నిర్మలాజ్యోతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెట్‌లో అర్హత సాధించిన బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరికి చెందిన జిల్లా వాసులు మాత్రమే అర్హులు. టెట్ మార్కుల పత్రం, నెటివిటీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, రెండు ఫొటోలు జతపరిచిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ లోపు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 93921 41545లో సంప్రదించవచ్చు.

యంత్రం తగిలి వృద్ధుడి మృతి

యంత్రం తగిలి వృద్ధుడి మృతి

యంత్రం తగిలి వృద్ధుడి మృతి

యంత్రం తగిలి వృద్ధుడి మృతి